Rising Debt in the State: రాష్ట్రంలో అప్పులు..లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆస్తుల సృష్టికి ఉపయోగపడే మూలధన వ్యయం కుంటుపడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో.. తొలి 8 నెలల లెక్కలను పరిశీలిస్తే 6వేల188 కోట్ల రూపాయలు మాత్రమే.. ఆస్తులు సృష్టించేందుకు ప్రభుత్వం వ్యయం చేసింది.
ఈ ఏడాది.. 30వేల 679 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తామని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపింది. అయితే.. అంచనాల్లో 20శాతం మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అప్పులు మాత్రం ఏకంగా అంచనాలకు మించి 11 శాతం అధికంగా తీసుకువచ్చింది. ఈ అప్పుల లెక్కల్లో కార్పొరేషన్ల రుణాల లెక్కల్ని బయటకు వెల్లడించడం లేదు. వాటిని కూడా కలిపితే రుణం అంచనాలకు మించి ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.