ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొక్కజొన్న లోడులో గంజాయి.. రూ.20 లక్షల సరకు స్వాధీనం - చిలకలూరిపేటలో గంజాయి అక్రమ రవాణా వార్తలు

పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాగుతూనే ఉంది. అక్రమ దారులు రవాణాకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మొక్కజొన్న బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని తెలిపారు.

Cannabis illegal transport in chilakaluripet guntur district
మొక్కజొన్న లోడులో గంజాయి రవాణా

By

Published : Jul 27, 2020, 1:00 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ. 20లక్షల విలువచేసే 280 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు జరిపి మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

'విశాఖపట్నం నుంచి తమిళనాడుకు మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీలో గంజాయి ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. దీంతో ముందుగానే అక్కడ తనిఖీలు నిర్వహించాం. మాకు వచ్చిన సమాచారం ప్రకారమే లారీలో దాదాపు 280 కిలోల గంజాయిని మొక్కజొన్న లోడుతో ఉన్న లారీలో తరలిస్తున్నారు. సమీపంలో ఉన్న మార్కెట్ యార్డుకు తీసుకెళ్లి బస్తాలు దించితే గంజాయి బయటపడింది. దాన్ని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్, క్లీనర్​ను అదుపులోకి తీసుకున్నాం. దీనిపై విచారణ ప్రారంభించాం. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరీనీ అరెస్ట్ చేస్తాం.' -- వెంకటేశ్వర్లు, సీఐ

ABOUT THE AUTHOR

...view details