ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీ తనకుసీటు కేటాయించకపోవటంతో... రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పార్టీకిరాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. బీసీ కోటాలో మాచర్ల, నరసరావుపేట, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లోఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలవాలని ఆయన ఆశించారు. పార్టీ అవకాశం కల్పించకపోవటంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ బుజ్జగించడంతో మరోసారి ఆలోచిస్తానని బోనబోయిన తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తామని డొక్కా వెల్లడించారు.