సీఎంగా పరిపాలన చేయడం జగన్‌కు చేతకాదని.... ఆయన ఆ కుర్చీ నుంచి పక్కకు తప్పుకుని తన పార్టీలోనే వేరే ఎవరికైనా ఆ పదవి ఇస్తే మంచిదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులు వచ్చే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. వైకాపా పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. అచ్చెనాయుడుని ఎదుర్కొనే ధైర్యం లేకనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బౌన్సర్లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
'ముఖ్యమంత్రి కుర్చీ నుంచి జగన్ తప్పుకోవాలి' - సీఎం జగన్ వార్తలు
వైకాపా పాలనపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి జగన్ తప్పుకోవాలని వ్యాఖ్యానించారు.
Buddha venkanna