రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు జరిగి ఉంటే శిక్షించాలని సవాల్ విసిరారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. విశ్వసనీయత లేని కమిటీలు ఇచ్చే నివేదికపై రైతులు ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. మహిళలు లక్ష్మీ సహస్రనామం చేస్తూ నిరసన తెలియజేశారు. ఎన్ని రోజులైనా ఆందోళన చేస్తామని రైతులు తెలిపారు. రైతుల తరఫున అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని బొండా ఉమ స్పష్టం చేశారు. స్థానిక శాసనసభ్యులు ముసుగు తీసి రైతుల మధ్యకు రావాలని అపుడే నిజాలు తెలుస్తాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి బొండా ఉమా సవాల్ - అమరావతి ప్రాంత రైతుల ఆందోళన
రాజధాని అమరావతిని చంపేందుకు వైకాపా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. తెదేపా హయాంలో అవినీతి జరిగి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
బొండా ఉమ