ఆశయం దిశగా అడుగులు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అప్పటివరకూ దాచుకున్న 70 లక్షలతో బ్లడ్‌బ్యాంక్ ప్రారంభించారు. అవగాహన ఉన్న మరో 8 మందితో కలిసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకూ 124 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని... ప్రతినెలా ఉచితంగా రక్తం అందిస్తున్నారు. రక్తదానం ఆవశ్యకతపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రక్తదాన శిబిరాలు నిర్వహించి... ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమున్న రోగులకు సైతం రక్తాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నారు.ఆదర్శ మార్గం రాష్ట్రంలో చాలా రక్తనిధి కేంద్రాలు ఉన్నా అవసరమైనప్పుడు రక్తం దొరకడం లేదు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు కల్యాణి లాంటి వారు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. సాధ్యమైనంత త్వరగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యువత పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో... 30 ఏళ్లకే ఉన్న ఉద్యోగాన్ని వదిలి.. సేవారంగం వైపు అడుగులు వేసిన కల్యాణి మార్గం ఆచరణీయం.. అనుసరణీయం.