ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్తకుప్పలో పేలుడు... పారిశుద్ధ్య కార్మికులకు గాయాలు - చెత్తకుప్పలో పేలుడు

చెత్త కుప్పులో పేలుడు సంభవించి పారిశుద్ధ్య కార్మికులు గాయపడిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కార్మికులు చెత్త సేకరిస్తుండగా ప్రమాదం జరిగింది.

చెత్తకుప్పలో పేలుడు
చెత్తకుప్పలో పేలుడు

By

Published : Oct 4, 2020, 8:33 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరిస్తుండగా... ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రాళ్ల ముక్కలు, సీసా పెంకులు చెల్లాచెదురయ్యాయి.

ఈ ఘటనలో శేషగిరి, శివయ్య అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. నాగేశ్వరావు, మూర్తిబాబులకు వినికిడి సమస్య తలెత్తింది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు...వినికిడి సమస్య ఉన్న వారికి వారంలో శస్త్ర చికిత్స చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details