భాజపా కార్యకర్త ఇంట పార్టీ జెండా పండిట్ దీన్ దయాళ్ వర్ధంతిని పురస్కరించుకుని భాజపా కార్యకర్తలకు... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ సూచన చేశారు. ప్రతి కార్యకర్త, నాయకుడు.. తమ ఇంటిపై భాజపా జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా... ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు 'మా కుటుంబం... భాజపా కుటుంబం' నినాదంతో జెండాలు ఎగరనున్నాయి. గుంటూరులో తన ఇంటి పై లక్ష్మీనారాయణ పార్టీ జెండా ఎగరేశారు. భాజపా నేతృత్వంలోని కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమ ఇంటి ముందు దీపాలు వెలిగించాలని కోరారు.