గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 32వ డివిజన్లో భాజపా-జనసేన అభ్యర్థుల తరుపున భాజపా మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామిని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే భాజపా-జనసేన బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని యామిని కోరారు. నగర అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం వాటిని సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తూ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు.
'వైకాపా అక్రమాల అడ్డుకట్టకు భాజపా-జనసేన కూటమిని గెలిపించండి' - municipal elections in guntur
రాష్ట్రంలో పుర ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల తరఫున పార్టీ నేతలు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గుంటూరు 32వ డివిజన్లో భాజపా-జనసేన అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ... భాజపా నేత సాధినేని యామిని ఓట్లు అభ్యర్థించారు.
భాజపా మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామిని