తెదేపా అవినీతిపై విచారణ జరిపించాలి: రఘనాథబాబు - enquiry
తెదేపా పాలనలో అవినీతి జరిగిందని.. ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని భాజపా సీనియర్ నేత రఘనాథ బాబు డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.
గత ఐదేళ్ల తెదేపా పాలనలో అవినీతి వ్యవహారాలు జరిగాయని... ప్రస్తుత ప్రభుత్వం సరైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భాజపా అధికార ప్రతినిధి వై.రఘనాథ బాబు కోరారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర ప్రభుత్వమే ఆ పని చేస్తుందని ఆయన అన్నారు. పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.... ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తే తమకేం అభ్యంతరం లేదన్నారు. అలా కాకుండా కేంద్రమే నిర్మించాలని కోరితే ఆ బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. తిరుపతి పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని చేసిన ప్రకటనను స్వాగతించారు.