గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారు పొన్న వాహనంపై శ్రీకృష్ణునిగా భక్తులకు దర్శనమిచ్చారు. వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గోపికలతో నందగోపాలుడు వేణుగానం చేస్తున్నట్లున్న సన్నివేశాలతో వాహనాన్ని ఏర్పాటుచేశారు. ఆలయ ప్రాంగణం నుంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పురవీధుల్లో ఉత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
పొన్న వాహనంపై శ్రీకృష్ణుడిగా భావ నారాయణుడు - బాపట్ల
బాపట్లలో క్షీర భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు పొన్నవాహనంపై విహరించారు. శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పొన్న వాహనంపై శ్రీకృష్ణునిగా భావనారాయణస్వామి