గుంటూరు జిల్లాలో తెదేపా నేతలపై వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో తెదేపా నేత బండ్లమూడి బాబురావుపై వైకాపా కార్యకర్తలు గురువారం దాడి చేశారు. ఈ దాడిలో బాబూరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ పొలంలో వైకాపా నేతలు మట్టి తవ్వుతున్నారని... ఈ విషయంపై నిలదీస్తే తన తండ్రిపై వైకాపాకు చెందిన ప్రసాద్, నాగ మల్లేశ్వర రావు, అమరేశ్వరరావు మారణాయుధాలతో దాడి చేశారని బాబూరావు కుమారుడు నరేష్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు వారాల్లోనే తమ గ్రామంలో ఉన్న తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని నరేష్ ఆరోపించారు.
అక్రమంగా మట్టి తవ్వకం..అడిగినందుకు ఆయుధాలతో దాడి - ponnur mandal
వైకాపా కార్యకర్తల దాడిలో తెదేపా నేత బండ్లమూడి బాబూరావు గాయపడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రికి బంధువులు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొనసాగుతున్న వైకాపా నేతల దాడులు