ప్రవాసాంధ్రులు ఏపీఎన్ఆర్టీకి పంపించిన కొవిడ్ సామగ్రిని తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆస్పత్రులకు అందజేశారు. అమెరికా, కెనెడా, గల్ఫ్ దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు సుమారు 4కోట్ల విలువైన సర్జికల్ మాస్కులు, పల్స్ ఆక్సీ మీటర్లు, ఫేస్ షీల్డులు, ఇతర సామగ్రిని పంపించారు. వీటిని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరాన్ని బట్టి అందించనున్నారు. ఈ సామగ్రిని గుంటూరు జనరల్ ఆస్పత్రి సిబ్బందికి... వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. కొవిడ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కరోనా బాధితులకు, వారికి చికిత్స అందించేందుకు వినియోగించే సామగ్రిని పంపించిన ప్రవాసాంధ్రులకు వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కొవిడ్ సామగ్రి పంపిన ఎన్ఆర్ఐలు.. ఆస్పత్రి సిబ్బందికి అందించిన వైవీ సుబ్బారెడ్డి - ఏపీఎన్ఆర్టీ తాజావార్తలు
ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీ)కి ఎన్ఆర్ఐలు పంపించిన కొవిడ్ సామగ్రిని తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆస్పత్రులకు అందజేశారు. అమెరికా, కెనెడా, గల్ఫ్ దేశాల్లో ఉన్న రాష్ట్ర వాసులు.... క్లిష్ట పరిస్థితుల్లో సాయమందించటం అభినందనీయమని ఆయన అన్నారు.
distribute covid instruments