ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టపగలే.. అపార్ట్​మెంట్​లో... దొంగల బీభత్సం! - police

గుంటూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ఆపార్ట్​మెంట్​లో చొరబడి 10 లక్షల విలువచేసే బంగారాన్ని దోచుకెళ్లారు.

చోరీ

By

Published : Sep 19, 2019, 6:58 PM IST

పట్టపగలే అపార్ట్​మెంట్​లో రెచ్చిపోయిన దొంగలు

గుంటూరు విద్యానగర్ రాధాకృష్ణ అపార్ట్​మెంట్​లో నివాసం ఉండే సురేష్ భార్యకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి రాగా... తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లో బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. బీరువాలో ఉన్న 10 లక్షల విలువైన ఆభరణాలు, లక్ష నగదు చోరీకీ గురైందని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details