ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"విజయసాయిరెడ్డి, జగన్​ కనుసన్నల్లోనే రాష్ట్రంలో మద్యం వ్యాపారం.. ఆధారాలున్నాయ్" - దిల్లీ మద్యం కుంభకోణం

TDP leaders on Delhi liquor scam: దిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో వైకాపా మాఫియా ఎక్కడి వరకు విస్తరించిందో తేలిందని తెలుగుదేశం ధ్వజమెత్తింది. తన అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి అరెస్టు కావడంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏం జవాబు చెబుతారని తెదేపా నేత పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. కల్తీ మద్యానికి సంబంధించి మా వద్ద ఆధారాలున్నాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

TDP
దిల్లీ మద్యం కుంభకోణంపై తెదేపా నేతల ఆగ్రహం

By

Published : Nov 10, 2022, 6:15 PM IST

TDP leaders on Delhi liquor scam: విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో మద్యం వ్యాపారం జరుగుతోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. వారికి సంబంధించిన కంపెనీల కల్తీ బ్రాండులను ప్రజలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. అరబిందో కెమ్ ఫార్మా, ట్రైడెంట్ లైఫ్ సైన్సెన్​కు సీఎఫ్​వోగా ఉన్న వ్యక్తి శ్రీనివాస్ కాశిచాయానుల.. అదాన్ డిస్టిలరీస్ పేరుతో శరత్ చంద్రారెడ్డి ఏపీలో మద్యం వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. శరత్ చంద్రారెడ్డి దగ్గర పనిచేసే చిరుద్యోగుల పేరుతో షెల్ కంపెనీలు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలున్నారనే విషయం తేటతెల్లమవుతోందన్నారు.

"జగన్‌, విజయసాయి కనుసన్నల్లో మద్యం వ్యాపారం సాగుతోంది. కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో అదాన్ డిస్టిలరీస్ పేరుతో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారం చేస్తున్నారు. శరత్ వద్ద పనిచేసే చిరుద్యోగుల పేరుతో షెల్ కంపెనీల నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమ్మే మద్యం.. అదాన్ డిస్టిలరీస్ నుంచే వస్తోంది. కల్తీ మద్యం అమ్మి ప్రభుత్వం రూ.24వేల కోట్లు దండుకుంది. కల్తీ మద్యానికి సంబంధించి మా వద్ద ఆధారాలున్నాయి. కల్తీ మద్యం వ్యాపారంపై ఈడీ, సీబీఐ విచారణ చేపట్టాలి." -ఏలూరి సాంబశివరావు

ప్రభుత్వం అమ్మే మద్యం అంతా అదాన్ డిస్టిలరీస్ నుంచే తయారై వస్తోందని ఆరోపించారు. ఈ మూడున్నరేళ్లలో రూ.24వేల కోట్లు కల్తీ మద్యం వ్యాపారంతో వైకాపా ప్రభుత్వం దండుకుందని దుయ్యబట్టారు. తమ దగ్గర దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలున్నాయని తెలిపారు. వైఎస్​ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్.. జగన్ రెడ్డి ధన దాహానికి బలయ్యారని ఆరోపించారు.

జగన్ రెడ్డి క్విడ్ ప్రో కో–2లో మద్యం ప్రధాన అస్త్రమని విమర్శించారు. గత మూడున్నరేళ్లలో రూ.77వేల కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగిందని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం మాఫియాకు కేరాఫ్ అడ్రస్​గా ఏపీ మారిందన్నారు. ఏపీలో కల్తీ మద్యం వ్యాపారంపై ఈడీ, సీబీఐ పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మద్యం వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details