రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై ప్రజల్లో అనుమానాలున్నాయని తెదేపా నేత కోడెల శివప్రసాదరావు అన్నారు. వీవీప్యాట్ వ్యత్యాసాల్లో అభ్యర్థుల సందేహాలను ఈసీ నివృత్తి చేయాలన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లెలో మాట్లాడిన ఆయన.. ఈవీఎంల పనితీరుపై శరద్ పవార్ వంటి నేతలెందరో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనడానికి వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం, గండిగనుముల ఘటనలే ఉదాహరణ అని కోడెల అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ప్రజాతీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: కోడెల - sattenapalli
రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తామని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈవీఎంల నిర్వహణపై ప్రజల్లో అనుమానాలున్నాయని.. అలాగే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు