హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి... హైకోర్టు చర్యలు చేపట్టింది. జిల్లా కోర్టుల్లో 3వేల 432, హైకోర్టులో 241 పోస్టులు కలిపి మొత్తం 3వేల673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసింది. పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్లను.... హైకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జిల్లా కోర్టుల్లో.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్ సహా మొత్తం 3 వేల432 పోస్టులు భర్తీ చేయనున్నారు. హైకోర్టులో.. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్లు, ఆఫీసు సబార్డినేట్లు సహా..మొత్తం 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలోని జిల్లా కోర్టులతో పాటు హైకోర్టులో భారీగా ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర చొరవ చూపారు. మొత్తం 3వేల673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు ను జారీ చేశారు.
ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు