"చంద్రన్న బీమా పరిధిలో రేషన్ డీలర్లు" - చంద్రన్న బీమా
డీలర్లను చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకొస్తామని... ఎవరైనా మరణిస్తే తక్షణ సాయంగా రూ.25వేలు అందిస్తామని మంత్రి ప్రత్తిపాటి హామీ ఇచ్చారు.
రేషన్ డీలర్లకిచ్చే కమీషన్ రూపాయికి పెంచుతున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. డీలర్లనూ చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకొస్తామని... ఎవరైనా మరణిస్తే తక్షణ సాయంగా రూ.25వేలు అందిస్తామని చెప్పారు. 85శాతం సంతృప్తి స్థాయి సాధించిన డీలర్లకు ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. డీలర్లకు ఉచిత వైద్య సౌకర్యం అందేలా చూస్తామని ఆ శాఖ కమిషనర్ వరప్రసాద్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు.