రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఇప్పటి వరకూ 41 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. మరో 8 లక్షల మంది వరకురైతులకు సాంకేతిక కారణాలతో నగదు పడలేదని అన్నారు.రైతులు సరైన పత్రాలతో వ్యవసాయ విస్తరణ అధికారుల్ని కలవాలని సూచించారు.లేకపోతే... 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. వెబ్ ల్యాండ్ లో ఆధార్ అనుసంధానం కానివారు వెంటనే సంబంధిత తహశీల్దార్‌ను కలిసి ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని కోరారు. కొందరి చరవాణిలకు నగదు జమ అయినట్లు సందేశం వచ్చినా బ్యాంకులో పడటం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు.ఆధార్ నంబర్ కోసం ఇచ్చిన చరవాణి నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉన్న నంబర్ వేరు కావటం వల్లే ఇలా జరుగుతోందని వివరణ ఇచ్చారు. రైతులు తప్పని సరిగా తాము వినియోగిస్తున్న ఫోన్ నంబర్ ను ఆధార్ లో, బ్యాంకులో అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సంబంధించి ఎలాంటి గడువు లేదని... ఎన్నికల కోడ్ కూడా వర్తించబోదని స్పష్టం చేశారు.
'నగదు' పడకుంటే.. ఫిర్యాదు చేయండి! - DETAILS
రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఇప్పటి వరకూ 41లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి తెలిపారు.
వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి