ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా శ్రేణుల అత్యుత్సాహం.. అన్నాక్యాంటీన్ పేరు మార్పు - rajanna canteen

నరసారావుపేటలో వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి.  నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపేందుకు తెదేపా ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను.. రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చారు. కనీసం ప్రభుత్వ ఆదేశాలు రాకముందే ఇలా చేయటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.

వైకాపా శ్రేణులు అత్యత్సాహం-అన్నా క్యాంటీన్ పేరు మార్పు

By

Published : May 31, 2019, 7:11 PM IST

వైకాపా శ్రేణులు అత్యత్సాహం-అన్నా క్యాంటీన్ పేరు మార్పు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. స్థానిక మార్కెట్ సెంటర్​లో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్​ను... నూతన ప్రభుత్వం ఏలాంటి ఆదేశాలు జారీ చేయకుండానే రాజన్న క్యాంటీన్​గా పేరు మార్చేశారు. క్యాంటీన్​కు వైకాపా జెండా రంగులను అద్దారు. ఎన్టీఆర్ చిత్ర పటాల స్థానంలో ముఖ్యమంత్రి జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆదేశాలు లేకుండానే వైకాపా శ్రేణులు ప్రదర్శించిన తీరు పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details