అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ నేతలు హెచ్చరించారు. రాజధాని రైతుల నిరసన దీక్షలు 250వ రోజుకు చేరుకున్న సందర్భంగా... వారు ఆదివారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
'అమరావతిని రాజధానిగా ప్రకటించకుంటే ఆందోళనలు తీవ్రతరం' - amaravathi latest news
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు 250వ రోజు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ నేతలు ఆదివారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ నేతల కాగడాల ప్రదర్శన
వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఐకాస అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి