ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూన్ నాటికి అంబేడ్కర్ విగ్రహం పూర్తి - అంబేడ్కర్ విగ్రహం

గుంటూరు జిల్లా శాఖమూరులో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం, విగ్రహం పనులను మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తెలిపారు.

అంబేడ్కర్ స్మృతి వనం, విగ్రహం పనులను మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు

By

Published : Feb 16, 2019, 7:04 PM IST

అంబేడ్కర్ విగ్రహం
గుంటూరు జిల్లా శాఖమూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డా బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం, 20 ఎకరాలలో స్మృతివనం నిర్మాణ పనులను మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. స్మృతివనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రతిఒక్కరూ సందర్శించే విధంగా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. అంబేడ్కర్ 125 జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఇది కూడా చూడండి: అమరవీరులకు అండగా ఏపీ

ABOUT THE AUTHOR

...view details