ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్తుండగా జై అమరావతి అంటూ రైతులు గట్టిగా నినాదాలు చేశారు. రైతులను నిలువరించేందుకు భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీక్షా శిబిరం వద్ద దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను మూయించారు.
రైతులు ముఖ్యమంత్రి కనిపించకుండా పోలీసులు అడ్డంగా నిలబడ్డారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యను ముఖ్యమంత్రికి కనబడకుండా మీరు ఎందుకు అడ్డుగా ఉన్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కూడా రైతుల వైపు కాకుండా మరో వైపు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు.