తమ గోడును పట్టించుకోని జగన్... సీఎం పదవికి రాజీనామా చేయాలని రాజధాని ప్రాంత మహిళలు డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షలు 50వ రోజుకు చేరాయి. మందడం, వెంకటపాలెం గ్రామాలకు చెందిన మహిళలు... భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. అమరావతిపై కేంద్రం వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరిని తప్పుపట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... కొంతమంది కుటుంబసభ్యులను మీడియా ముందుకు తెచ్చి... అసలు సమస్యే లేనట్లుగా ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
'మా గోడు పట్టించుకోని సీఎం జగన్.. రాజీనామా చేయాలి' - amaravathi farmers darna latest news
అమరావతి రైతుల దీక్షలు 50వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో మహిళా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు మరణిస్తున్నా.. సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
'మా గోడు పట్టించుకోని సీఎం జగన్.. రాజీనామా చేయాలి'