ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు మద్దతివ్వండి... పవన్​కు వినతి పత్రం' - pawan kalyan on amaravathi

అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాని అమరావతి పరిరక్షణ సమితి జనసేనాని పవన్ కల్యాణ్​ను కోరింది. ఐకాస సభ్యులు పవన్​కు వినతి పత్రం అందించారు. వేల కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మాణాలు చేపట్టాక.. ఇప్పటికిప్పుడు రాజధానిని తరలిస్తామనడం సబబుకాదన్నారు. రాజధాని అంతా ఒకేచోట ఉండాలన్నదే తమ అభిప్రాయమని పవన్ అన్నారు.

Amaravathi parirakshna samithi jac met pawan kalyan
పవన్ మద్దతు కోరిన అమరావతి పరిరక్షణ సమితి

By

Published : Dec 31, 2019, 6:41 AM IST

పవన్ మద్దతు కోరిన అమరావతి పరిరక్షణ సమితి
అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధులు జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన పరిరక్షణ సమితి ప్రతినిధులు పవన్​కు వినతిపత్రం అందజేశారు. శివరామకృష్ణన్ కమిటీ సూచనల మేరకే గత ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడి చారిత్రక నేపథ్యం కూడా అందుకు దోహదం చేసినట్లు వివరించారు.


వేల కోట్లు రాజధాని నిర్మాణం కోసం వెచ్చించాక... ప్రభుత్వ ఉద్యోగులంతా ఇక్కడి నుంచే పనిచేయటం ప్రారంభించాక వేరేచోటికి రాజధాని తరలించటం సరికాదన్నారు. ఇప్పటికిప్పుడు 3 చోట్ల రాజధానులంటే అందుకు రూ.20 వేల కోట్లు అవసరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరేచోటికి తరలివెళ్లటం కూడా కష్టమని వివరించారు. అందుకే అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఐకాస సభ్యులు స్పష్టంచేశారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుల మాటల్ని సావధానంగా విన్న పవన్... రాజధాని ఒకేచోట ఉండాలనేదే తమ అభిప్రాయమని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details