రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 99వ రోజూ కొనసాగాయి. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని రైతులు తమ ఇళ్లల్లోనే దీక్షలు కొనసాగించారు. ముగ్గురు, లేదా నలుగురు కూర్చుని.. సామాజిక దూరం పాటిస్తూ దీక్షలో పాల్గొన్నారు. పండుగ రోజైనా లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తున్నారు. పండుగైనా మరేదైనా... అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేంత వరకూ పోరాటం ఆపే ప్రసక్తే లేదని అన్నదాతలు స్పష్టం చేశారు.
99వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు - అమరావతి రైతుల దీక్ష
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు. కరోనా గో బ్యాక్ అంటూనే... జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు.
99వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు