ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం గెలుస్తుంది-అమరావతి నిలుస్తుంది: అమరావతి రైతులు - అమరావతి రైతుల ఆందోళనలు

అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షలు 304వ రోజుకు చేరుకున్నారు. బోరుపాలెంలో వర్షాన్ని లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు నిరసనలో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళా రైతులపై అసభ్యంగా పోస్టులు పెట్టడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

amaravathi farmers protest
అమరావతి ఆందోళనలు

By

Published : Oct 16, 2020, 2:03 PM IST

'న్యాయం గెలుస్తుంది- అమరావతి నిలుస్తుంది' అనే నినాదాలతో 304వ రోజు అమరావతి దీక్షలు కొనసాగాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బోరుపాలెం మహిళా రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. మహిళలు, చిన్నారులు నిరసనలో పాల్గొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో మహిళా రైతులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. తమపై అసభ్యకర పోస్టులు పెట్టేవారికి మద్దతు పలుకుతూ తిరిగి తమపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. 304 రోజులుగా సుదీర్ఘంగా పోరాడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యేలు స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details