రాజధాని రైతులు తమ సంకల్పదీక్ష కోసం వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ రైతులు 301వ రోజూ దీక్షలు కొనసాగించారు. వెలగపూడి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, ఐనవోలు, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, పెదపరిమి, లింగాయపాలెం గ్రామాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కృష్ణాయపాలెం రైతులు వర్షంలో సైతం ధర్నా నిర్వహించారు. తుపాన్లు, వరదలు వచ్చినా.... తమ ఆందళనను విరమించబోమని రైతులు తేల్చిచెప్పారు.
తుపాన్లు వచ్చినా ఉద్యమం ఆగదు: రాజధాని రైతులు - అమరావతి రైతుల ఆందోళన
వర్షంలో సైతం అమరావతి రైతులు దీక్షను వదలలేదు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ రైతులు 301వ ఉద్యమాన్ని కొనసాగించారు. తుపాన్లు వచ్చినా తమ ఆందోళనలు విరమించబోమని రైతులు తేల్చిచెప్పారు.
తుపాన్లు వచ్చినా ఉద్యమం ఆగదు: రాజధాని రైతులు