రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 265వ రోజుకు చేరుకుంది. కృష్ణాయపాలెం, వెలగపూడి, తుళ్లూరు, ఐనవోలులో రైతులు, మహిళలు నిరసన దీక్షను కొనసాగించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైకాపా సర్కార్.. అడుగడుగున అన్నదాతలను మోసం చేస్తోందని రైతులు మండిపడ్డారు. పంపుసెట్లకు మీటర్ల పేరుతో రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంపై... రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆందోళన చేపట్టాలని అమరావతి రైతులు పిలుపునిచ్చారు.
'వైకాపా ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోంది' - అమరావతి రైతుల దీక్షలు వార్తలు
ఆదాయం వచ్చే అమరావతిని ప్రభుత్వం నట్టేట ముంచిందని రైతులు ఆరోపించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షలు 265వ రోజుకు చేరాయి. పంపుసెట్లకు మీటర్ల పేరుతో తమను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు.
'వైకాపా ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోంది'