పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... రైతులు చేస్తున్న దీక్షలు 154వ రోజుకు చేరుకున్నాయి. మందడం, దొండపాడు, అనంతవరం, పెదపరిమి, తుళ్లూరులో... రైతులు, మహిళలు ధర్నాలు చేపట్టారు. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ల వద్దే దీక్షలు కొనసాగించారు. పోలీసుల ఆంక్షల నడుమ రైతులు తమ డిమాండ్ల కేసం ఇళ్ల వద్దే ఆందోళన చేపట్టారు. కరోనాను తరిమేసి అమరావతిని సాధిస్తామంటూ నినాదాలు చేశారు.
కరోనాను తరిమేస్తాం... అమరావతిని సాధిస్తాం..!! - amaravathi latest updates
ప్రపంచమంతా కరోనా కారణంగా అతలాకుతలమౌతుంటే... అమరావతి రైతులు మాత్రం లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... రాజధాని కోసం వారి దీక్షలు కొనసాగిస్తున్నారు. అమరావతి రైతులు, మహిళలు, చిన్నారులు ఇళ్ల వద్దనే 154వ రోజు దీక్షను చేపట్టారు.
లాక్డౌన్లోనూ కొనసాగుతున్న అమరావతి రైతులు ఆందోళన