'కష్టాలు చూడలేని ప్రభుత్వానికి ఇలా నిరసన తెలుపుతున్నాం'
అమరావతి రైతుల ఆందోళనలు 74వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... రైతులు పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం రైతులు, మహిళలు... జై అమరావతి అంటూ నినదించారు. తమ కష్టాలను ప్రభుత్వం చూడలేదంటూ కళ్లు మూసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు.
కళ్లుముసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు
తమ కష్టాలను చూడని ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలోని రైతులు 74వ రోజూ నిరసన దీక్షలు చేపట్టారు. కృష్ణాయపాలెంలోని మహిళలు, రైతులు కళ్లు మూసుకొని నిరసన తెలిపారు. 74 రోజులు గడుస్తున్నా తమ ఆవేదనను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమంటూ వాపోయారు. రైతులు, మహిళలను పెయిడ్ ఆర్టిస్టులన్న వైకాపా నేతలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.