ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలుపెరగని అన్నదాతలు... 152వ రోజుకు అమరావతి దీక్షలు - amaravathi capital agitation news

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న దీక్ష 152వ రోజుకు చేరుకుంది. పూర్తి స్థాయి పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారంతా కోరుతున్నారు. ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.

amaravathi capital farmer agitation
152వ రోజుకు చేరుకున్న అమరావతి దీక్షలు

By

Published : May 17, 2020, 4:02 PM IST

పూర్తి స్థాయి పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 152వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలం మందడం, తుళ్లూరు, దొండపాడులలో రైతులు, మహిళలు, చిన్నారులు సామాజిక దూరం పాటిస్తూనే ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు.. విశాఖలో వైద్యుడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. తుళ్లూరులో రాజధాని దళిత ఐకాస నేతలు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. దళితులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details