సామూహిక ఆత్మహత్యలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రాజధాని రైతులు కోరారు. మందడంలో రైతులు, మహిళలు 261 రోజు నిరసనకు దిగగా... మంత్రి మండలి సమావేశం జరుగుతున్నందున వారిని పోలీసులు దీక్షా శిబిరాల నుంచి బలవంతంగా బయటకు పంపించారు. పోలీసుల తీరుపై మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చే ప్రతి సారి తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మహిళలు ఆక్షేపించారు. ప్రైవేటు స్థలంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.
మరోవైపు రాజధానిలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రమంతా తెలియజేసేందుకు దళిత ఐకాస నేతలు పర్యటన ప్రారంభించారు. అసైన్డ్ రైతులకు ఇంతవరకు కౌలు చెల్లించలేదని, ప్రభుత్వం ఇస్తామన్న 5000 పెన్షన్ ఇంతవరకు తమ ఖాతాలో పడలేదని ఐకాస నేతలు చెప్పారు.