ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరకట్ట ఇళ్లు ఖాళీ చేయిస్తాం-ఆళ్ల రామకృష్ణారెడ్డి

కృష్ణా నది కరకట్ట పక్కనున్న నివాసం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని... వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శాసనసభ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కరకట్టపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుకు వెళ్తామని చెప్పారు.

alla rk

By

Published : Jun 18, 2019, 12:46 PM IST

అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు...ఇప్పుడు రాజధానిపై మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు.ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయం గుర్తుచేశారు.రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదని ఆర్ కే అన్నారు.పనులు ఎందుకు నిలిపివేశారో గుత్తేదారులే సమాధానం చెప్పాలన్నారు.గుత్తేదారులకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.సీఆర్​డీఏ ఛైర్మన్ గా సీఎం ఉంటారని...ఆ పదవి తనకు ఇస్తారన్న విషయం తెలియదని అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details