ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్షేమానికి చిరునామా... చంద్రబాబు: ఆలపాటి - గుంటూరు

చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ...పాలన సాగించారని గుంటూరు జిల్లా తెనాలి తెదేపా అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్   వ్యాఖ్యానించారు. తెనాలిలో ఆయన కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఆలపాటి ప్రచారం

By

Published : Mar 30, 2019, 8:46 PM IST

ఆలపాటి ప్రచారం
గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు తెనాలి మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఆలపాటి... సంక్షేమం అంటే అలపాటి అనే నినాదాలతో కార్యకర్తలు ఉత్సహంగా రోడ్ షో నిర్వహించారు. తెదేపా ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే నియోజవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ... పరిపాలన సాగించారని కొనియాడారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details