ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలను మళ్లించటంపై న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు ఆరు వేల కోట్లకుపైగా నిధులను సాధారణ పథకాలను మళ్లించినా ప్రశ్నించకుండా ఉండాలా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ఏప్రిల్ 14వ తేదీన జై భీం యాక్సెస్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని గుంటూరులో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా తలపెట్టిన బహిరంగ సభను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వెనకబడిన వర్గాలపై దాష్టీకాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్‌ప్లాన్ నిధులను మళ్లించినా ప్రశ్నించవద్దా..? న్యాయవాది శ్రవణ్ కుమార్ - న్యాయవాది శ్రవణ్ కుమార్
సబ్ ప్లాన్ నిధుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై న్యాయవాది శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఆరు వేల కోట్ల రూపాయలను ఇతర పథకాలకు మళ్లించటం దారుణమన్నారు. ఏప్రిల్ 14న గుంటూరులో భారీ బహిరంగసభను తలపెట్టినట్లు తెలిపారు.
ఏపీలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల