ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అడెక్కో గ్రూపు కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఈరోజు అమరావతిలో భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్‌కు చెందిన అడెక్కో... భారత్‌లో పెద్దఎత్తున వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను మంత్రి వారికి వివరించారు. ఐటీ రంగానికి ఇచ్చిన పాలసీలు, రాయితీల గురించి తెలిపారు. ఐటీ సర్వీసులు, హెచ్ఆర్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ఏర్పాటుకు వారు అంగీకరించారు. రాష్ట్ర యువతకు అధునాతన సాంకేతికతలో నైపుణ్య శిక్షణకు సహకరించాలని మంత్రి కోరారు.
రాష్ట్రానికి 'అడెక్కో' - minister
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన అడెక్కో గ్రూపు కంపెనీ... ఏపీలో ఐటీ సర్వీసులు, హెచ్ఆర్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ఏర్పాటుకు అంగీకరించింది.
అడెక్కో కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ
Last Updated : Feb 28, 2019, 11:16 AM IST