ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పన్ను ఎగవేతదారునికి రూ. 42 లక్షలు జరిమానా

పన్ను ఎగవేసిన ఓ క్వారీ నిర్వాహకుడి నుంచి 42 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. నిందితుడు 8 లక్షలు మేర జీఎస్టీ చెలించలేదని అధికారులు వెల్లడించారు.

By

Published : Jul 14, 2021, 10:41 AM IST

Published : Jul 14, 2021, 10:41 AM IST

Penalty for tax evasion
పన్ను ఎగవేతదారునికి జరిమాన

పన్ను ఎగవేతకు పాల్పడిన క్వారీ నిర్వాహకుడి నుంచి రూ.42 లక్షలు వసూళ్లు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరిచర్లలోని క్వారీల్లో డిప్యుటీ కమిషనర్ మురళీకృష్ణ, పిడుగురాళ్ల డిప్యూటీ అసిస్టెంట్ భాస్కర్ ఆధ్వర్యంలో వాణిజ్య శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో క్వారీ యజమాని ఒకరు.. గనులు, భగర్భ శాఖకు చెల్లించాల్సిన రూ.18 లక్షలు మేర జీఎస్టీ చెలించలేదని తేలింది.

అతను కొనుగోలు చేసిన ముడి సరకుపై వాణిజ్య వాణిజ్య పన్నుల శాఖ నుంచి 18 లక్షల ఇన్​పుట్ టాక్స్ క్రెడిట్ కోరినట్లు చెప్పారు. వ్యాపారికి టాక్స్ క్రెడిట్ అంత మొత్తంలో లేదని నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీటితో పాటు సదరు వ్యాపారి వాణిజ్యా పన్నులు శాఖకు తక్కువ మొత్తంలో అమ్మకాలు చూపించాడు అని చెప్పారు. ఈ మేరకు సదరు క్వారీ యజమాణి నుంచి రూ. 42 లక్షలు పన్ను వసూలు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ తెలిపారు. అంతే కాకుండా పెనాల్టీ రూపంలో మరో రూ.42 లక్షలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details