ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనిశా వలలో.. జలవనరుల శాఖాధికారి - acb rides

లంచం తీసుకుంటూ ఓ సీనియర్​ అధికారి అనిశా వలకు చిక్కాడు.

'గుంటూరులో అనిశా వలకు చిక్కిన జలవనరుల శాఖాధికారి'

By

Published : Sep 19, 2019, 11:44 PM IST

'గుంటూరులో అనిశా వలకు చిక్కిన జలవనరుల శాఖాధికారి'

గుంటూరులో జలవనరుల శాఖ గేజింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. రామకృష్ణ కుమార్ అనే వ్యక్తి గేజింగ్ విభాగంలో వర్క్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం తన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతూ.... తను పనిచేసిన కార్యాలయం చుట్టూ 4 నెలలుగా తిరుగుతున్నాడు. అక్కడే పనిచేసి రిటైర్ అయిన తన విషయంలో... ఓ అధికారి 50 వేలు లంచం తీసుకురానిదే ఫైలు ముందుకు కదలదని చెప్పగా... చివరకు 30 వేలకు అంగీకరించాడు. విధి లేని పరిస్థితిలో విశ్రాంత ఉద్యోగి అనిశా అధికారులను ఆశ్రయించాడు. అనంతరం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ భుజంగరావు అనే సీనియర్ అసిస్టెంట్ అనిశాకు పట్టుబడ్డాడు. కార్యాలయంలోని మిగతా సిబ్బందిపై విచారణ చేస్తున్నామని అనిశా ఏఎస్పీ సురేశ్ బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details