ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ జవ్వాజీ శ్రీనివాసరావు ఇంటిపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ. 3కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు అనిశా అధికారులు తెలిపారు. శ్రీనివాసరావుకు సంబంధించిన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని మొత్తం 6 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు, బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన దస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అనిశా ఏఎస్పీ సురేష్ కుమార్ చెప్పారు.
సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో అనిశా సోదాలు - అసిస్టెంట్ శ్రీనివాసరావు
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న శ్రీనివాసరావు ఇంటిపై అవినీతినిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 3కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
అసిస్టెంట్ ప్రోఫెసర్ ఇంటి అనిశా డాడి