గుంటూరు జిల్లాలో వరప్రసాద్ అనే వ్యక్తి అనారోగ్యంతో జీజీహెచ్లో చేరాడు. ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే అతను మరణించాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు వేలల్లో డబ్బులు డిమాండ్ చేశారు. బంధువులంతా కృష్ణా జిల్లాలో ఉండడం వల్ల లాక్డౌన్ కారణంగా రాలేకపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి ఎదురైందని మృతుని భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. విషయం తెలుసుకున్న అమ్మ ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు.. స్పందించి మృతదేహాన్ని తమ వాహనంలో శ్మశాన వాటికకు తరలించారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు తామే భరిస్తామని తెలిపారు.
అనారోగ్యంతో వ్యక్తి మృతి.. అయినోళ్లు లేకుండానే దహనం - latest news of lockdown in guntur dst
అనారోగ్యంతో చేరిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో బంధువులు ఎవరూ అక్కడకు రాలేకపోయారు. అంత్యక్రియలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక.. అతని భార్య కన్నీరు మున్నీరుగా విలిపించింది. దీనిపై స్పందించిన అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చారు.
అమ్మచారిటబుల్ ట్రస్ట్ తరుపన మృతదేహం తరలింపు