వైకాపా నేత తన పొలాన్ని ఆక్రమించాడని ఆరోపిస్తూ నల్లమోతు వెంకట శ్యామ్‌కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు పెద్దకాకని రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి దూకేందుకు ప్రయత్నించాడు.
ఆత్మహత్యాయత్నానికి కారణం:

వైకాపా నేత నల్లమోతు శివరామకృష్ణ తన పొలాన్ని ఆక్రమించి.. అందులో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నాడని శ్యామ్ ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసులకు, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శివరామకృష్ణ అధికార పార్టీ నేత అని అధికారులు భయపడుతున్నారని వాపోయాడు.
తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న తన పొలాన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని... దీన్ని అడ్డుకోవాలని వేడుకుంటున్నాడు. జీవనాధారమైన తన పొలాన్ని.. అధికారికంగా తనకు అప్పగించకపోతే ఆత్మహత్యే తప్ప వేరే దారిలేదని బోరుమంటున్నాడు. ప్రభుత్వమే బాధ్యత వహించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితుడి భార్య అతన్ని కిందకి దింపారు.
ఇదీ చదవండి: దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య