COW KICKED THE GVL : భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు మిర్చియార్డులో ఓ కార్యక్రమానికి వచ్చిన జీవీఎల్.. అక్కడి గోశాలలోని ఆవును తాకి.. నమస్కరించేందుకు వెళ్లగా.. అది కాలితో తన్నింది. తేరుకున్న జీవీఎల్ మరోసారి ఆవు వద్దకు వెళ్లగా అది మళ్లీ కాలితో తన్నింది. అప్రమత్తమైన జీవీఎల్ వెనక్కి తప్పుకోవడంతో.. గాయాలు కాకుండా బయటపడ్డారు. ఆవును సముదాయించిన నిర్వాహకులు.. GVLని రమ్మని కోరగా.. ఆయన దూరం నుంచే నమస్కారం చేసుకుంటూ వెళ్లిపోయారు.
జీవీఎల్‌కు ఊహించని పరిణామం.. నమస్కరిస్తుండగా కాలితో తన్నిన గోవు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
COW KICKED THE GVL IN GUNTUR : బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు ఊహించని అనుభవం ఎదురైంది. గుంటూరు మిర్చియార్డులో ఓ కార్యక్రమానికి వచ్చిన జీవీఎల్.. అక్కడి గోశాలలోని ఆవును తాకి.. నమస్కరించేందుకు వెళ్లగా.. అది కాలితో తన్నింది.
COW KICKED THE GVL IN GUNTUR
Last Updated : Dec 10, 2022, 12:49 PM IST