గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి వద్ద సాగర్ కాలువలో ఓ కారు బోల్తా కొట్టింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తాళ్లపల్లిలో ఉన్న సాగర్ కుడి కాలువ వద్ద ఓ కారును ఉంచారు. అందులో గ్రామానికి చెందిన నలుగురు యువకులు కూర్చొన్నారు. అయితే కారును రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. అప్పటికే అందులో ఉన్న యువకులు.. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతున్న కారులోంచి దూకి సురక్షితంగా ఒడ్డుకి చేరారు.
రివర్స్ తీస్తుండగా.. సాగర్ కుడి కాలువలో బోల్తా కొట్టిన కారు... - గుంటూరు వార్తలు
కారును రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సాగర్ కుడి కాలువలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి వద్ద జరిగింది.
సమాచారం తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకొని ప్రొక్లెయినర్ సహాయంతో కారును బయటకు తీయించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల అడిగొప్పుల వద్ద కారు సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లి తల్లీబిడ్డ మృతిచెందిన ఘటన మారువక ముందే.. ఈ ఘటన చోటుచేసుకోవడం కాలువల వద్ద రక్షణ చర్యల మీద అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:సాగర్ కాలువలోకి దూకిన ప్రేమజంట.. యువతిని రక్షించిన స్థానికులు