నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 28 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా... అందులో వివరాలు సక్రమంగా లేని ఏడుగురు అభ్యర్థులకు సంబంధించిన 8 సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పరిశీలన అనంతరం చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 21 మంది అభ్యర్థులకు చెందిన 31 సెట్ల నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.