ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా విజ్ఞాన్ వర్శిటీ స్నాతకోత్సవం - guntoor

విజ్ఞాన్ విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఒకప్పటి విద్యార్థులు.. నేటి ప్రముఖులు ఎందరో హాజరై ఆహ్లాదంగా గడిపారు. గత స్మృతులను నెమరు వేసుకున్నారు.

గుంటూరులో జరిగిన స్నాతకోత్సవం

By

Published : Jul 27, 2019, 11:04 PM IST

గుంటూరులో జరిగిన స్నాతకోత్సవం

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో యుద్ధవిమానాల తయారీ నిపుణులు కోట హరినారాయణ, గుండెవైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే, టీసీఎస్ సీనియర్ వైస్ ప్రసిడెంట్ రాజన్న, సంగీత దర్శకులు ఇళయరాజా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పదిహేను వందల 69 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం వారికి అతిథులు డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ... సాంకేంతికత అన్ని రంగాల్లో విస్తరించిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని వ్యాఖ్యానించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు దారి తప్పకుండా ఉండేలా తక్కువ ఖర్చుతో మొబైల్ అప్లికేషన్ తయారు చేశామని వాటిని .. టీసీఎస్ సీనియర్ వైస్ ప్రసిడెంట్ రాజన్న తెలిపారు. సంగీత దర్శకులు ఇళయరాజా మాట్లాడుతూ.. విద్యార్ధులు భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ... విద్యార్ధులనుద్దేశించి ఆయన పాట పాడారు. వైద్యరంగానికి సరిపడనిధులు ఉంటే ప్రజలకు మేలైన సౌకర్యాలు అందిచ్చవచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details