ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Nov 9, 2022, 6:59 PM IST

  • "విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయడం సరికాదు"
    High Court on Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో 3.98 కోట్ల మంది ఓటర్లు.. 10 లక్షలకు పైగా ఓటర్లు తొలగింపు
    AP draft voters list: రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. ఈనెల 9 నాటికి రాష్ట్రంలో 3.98 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 78,438 మంది అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి వివిధ కారణాలతో 10.52 లక్షల మంది తొలగించినట్లు పేర్కొన్నారు. ఓటర్‌ కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదన్నారు.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇప్పటంలో ఎట్టకేలకు వైఎస్‌ఆర్‌ విగ్రహాలు తొలగింపు
    Ippatam: రహదారి విస్తరణ కోసమంటూ ప్రభుత్వం గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు కూల్చివేసింది. కాని అదే రోడ్లు మార్గంలోనున్న 2 వైఎస్‌ఆర్‌ విగ్రహాలను తొలిగించకపోవడంతో.. వైకాపా ప్రభుత్వంపై ప్రజలు, నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలు తొలిగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అల్పపీడన ప్రభావం.. ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
    AP Weather: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 10, 11న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నకిలీ బ్యాంక్​తో భారీ స్కామ్.. 10 బ్రాంచ్​లు నడుపుతూ కోట్లు మోసం.. చివరకు..
    నకిలీ బ్యాంక్​ను స్థాపించిన ఓ వ్యక్తి దాని ద్వారా ఆ ప్రాంతంలోనే పలు బ్రాంచ్​లను ఏర్పాటు చేసి ఖాతాదారులను మోసం చేయాలనుకున్నాడు. అలా 2 కోట్లతో పరారవ్వాలనుకున్న ఓ వ్యక్తి ఆఖరికి కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్​లైన్!
    పెద్ద నోట్ల రద్దు అంశంపై అఫిడవిట్ సమర్పించడంలో విఫలమైన కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా సవివర నివేదిక సమర్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణను వాయిదా వేయడం కోర్టుకు అవమానకరమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా హైదరాబాదీ 'అరుణ'
    అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌ కావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫేస్​బుక్ ఉద్యోగులకు షాక్.. 11వేల మందికి ఉద్వాసన.. నియామకాలు బంద్
    ఫేస్​బుక్ ఉద్యోగులకు షాక్ తగిలింది. 11 వేల మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. మెటా చరిత్రలో అత్యంత కఠినమైన మార్పు ఇదేనని సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 worldcup: కీలక పోరులో కివీస్​పై విజయం.. ఫైనల్​కు పాక్​
    అనూహ్య పరిస్థితుల్లో సెమీస్‌కి చేరి ఆశ్చర్యపరిచిన పాకిస్థాన్‌.. సెమీపోరులో మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌లో అడుగు పెట్టింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'బ్రహ్మస్త్ర-2' క్రేజీ అప్డేట్.. రణ్​బీర్​ పేరెంట్స్​గా దీపికా పదుకుణె, విజయ్ దేవరకొండ​!
    బీటౌన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'బ్రహ్మస్త్ర-2'లో రణ్​బీర్​ తండ్రిగా రౌడీ హీరో విజయ దేవరకొండ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రణ్​బీర్​ తల్లి పాత్రను స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకుణె పోషిస్తున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details