ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ డ్రైవర్​ను కొట్టి రూ.70 వేలు అపహరణ.. కేసు నమోదు

గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చిలకలూరిపేట ఎన్​టీఆర్​ సెంటర్​ వద్ద ఓ లారీ డ్రైవర్​ను కొట్టి అతని వద్ద ఉన్న రూ.70 వేల నగదును అపహరించారు. ఘటనపై డ్రైవర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

70 thousand rupees robbed from lorry driver at chilakaluripeta ntr center
దర్యాప్తు ప్రారంభించిన నరసారావుపేట పోలీసులు

By

Published : Jul 5, 2020, 6:48 AM IST

లారీ డ్రైవర్​ను కొట్టి అతని వద్ద ఉన్న రూ.70 వేల నగదును దుండగులు అపహరించిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. చెన్నై నుంచి వచ్చిన లారీ డ్రైవర్ ఎన్​టీఆర్​ సెంటర్​ వద్ద​ ఓ పెట్రోల్ బంకు వద్ద ఆపి... పక్కనే ఉన్న​ ఏటీఎంలో డబ్బులు తెచ్చుకున్నాడు. వాటితో సంతలో పశువులను కొనుగోలు చేసి చెన్నై తీసుకెళ్లాల్సి ఉంది. ఇంతలో లారీ వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతన్ని కొట్టి తన వద్ద ఉన్న రూ.70 వేల నగదును లాక్కెళ్లారు. చోరీపై డ్రైవర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details