ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాజాగా 441 కేసులు.. మొత్తంగా 58,827

గుంటూరు జిల్లాలో శనివారం కొత్తగా 441 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు జిల్లాలో 58,827 కరోనా కేసులు నమోదు కాగా.. 548 మంది మృతిచెందారు.

Breaking News

By

Published : Oct 6, 2020, 11:24 PM IST

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 441 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 58, 827కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 118 కేసులు.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి.

మొత్తంగా 51 వేల 854 మంది ఇంటికి..

జిల్లా పరిధిలోని తాడేపల్లి-35, సత్తెనపల్లి-31, నరసరావుపేట-24, చిలకలూరిపేట-24, రేపల్లె-18, తెనాలి-18, నకరికల్లు-16, నాదెండ్ల-13, చెరుకుపల్లి-10 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 51 వేల 854 మంది ఇంటికి చేరుకున్నారు.

రెండో స్థానంలో..

వైరస్ ప్రభావంతో సోమవారం ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 548 కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇవీ చూడండి:

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్‌

ABOUT THE AUTHOR

...view details