ఉద్యోగాలు ఇవ్వాలంటూ 1998 డీఎస్సీ అభ్యర్థులు.. గుంటూరు జిల్లా మంగళగిరిలో సెల్‌టవర్ ఎక్కారు. కడప జిల్లా పులివెందులకు చెందిన రమేశ్, రమణ, నెల్లూరుకు చెందిన శ్రీనివాసులు మంగళగిరిలో సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
PROTEST : ఉద్యోగాలు కల్పించాలని.. సెల్ టవర్ ఎక్కిన 1998 డీఎస్సీ అభ్యర్థులు - mangalagiri
గుంటూరు జిల్లా మంగళగిరిలో.. 1998 డీఎస్సీ అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
ఉద్యోగాలు కల్పించాలంటూ...సెల్ టవర్ ఎక్కి నిరసన
తమకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు దిగేది లేదని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, టవర్ ఎక్కిన వారితో చర్చలు జరిపారు.
ఇదీచదవండి.